తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మహా మట్టి గణపతి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన! ఎక్కడంటే.?
Mon Jun 16, 2025 20:17 Politics
విజయవాడలో 72 అడుగుల మట్టి మహాగణపతిని ఏర్పాటు చేయనుండటం ప్రశంసనీయమని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. విజయవాడ లేబరు కాలనీ మైదానంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి మహాగణపతి విగ్రహ ఏర్పాటు కోసం సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మట్టితో మహాగణపతిని తయారు చేయడం స్ఫూర్తినీయమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా గణేశుని ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఎంపీ కేశినేని శివనాధ్ తనయుడు వెంకట్ మాట్లాడుతూ వినాయక చవితికి అందరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి ప్రతిమలకు పూజ చేయాలన్న స్పూర్తిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డూండీ గణేష్ సేవా సమితి కలిగించిందన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా 72 అడుగుల మట్టి మహాగణపతిని ఏర్పాటు చేసి భక్తుల మన్నను పొందామన్నారు. ఈ కార్యక్రమంలో డూండీ గణేష్ సేవా సమితి కమిటీ సభ్యులు గడ్డం రవి, ముక్తేశ్వరరావు, సుబ్బారావు, కూటమి నాయకులు శివశర్మ లక్ష్మణరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #StoneLaid #Giant Clay Ganesha Sattue #72Foot #Tollywood acter #viralnews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.